నిర్భయ దోషుల ఉరితీత
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. దిల్లీలోని తీహార్ జైలులో ఈ నలుగురికీ అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురు దోషులూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తీహార్ జైలు డైరక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు.
నిర్భయకు న్యాయం జరిగింది : ఆశాదేవి
నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని, ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని ఆమె అన్నారు. దీనికోసం తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. చట్టంలోని లోపాలను సరి చేయాలని ఆమె కోరారు.













