రంగుమారిన పాస్ పోర్ట్!
విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పాస్‌పోర్టులు నిబంధనలు మార్చనుంది. జూన్ నుంచి కొత్త పాస్‌పోర్టు విధానాలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబందించి మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనల మేరకు పాస్‌పోర్టు కలర్ మారుతుందని, వివిధ కేటగిరిలకు జారీచేసే పాస్‌పోర్టులు వేర్వేరు వర్ణాల్లో ఉంటాయని తెలిపింది. పాస్‌పోర్టు చివరి పేజీలో తల్లిదండ్రుల పేర్లు ఇక ఉండవని, పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ విధానాన్ని తొలగిస్తున్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆన్లైన్లోనే వెరిఫికేషన్ ఉంటుందని సృష్టం చేసింది.













