విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
విదేశాల్లో మెడిసిన్ చేయాలనుకునే భారతీయ విద్యార్థులు ఇకనుంచి తప్పనిసరిగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో అర్హత సాధించాల్సిందే.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబందనలు ఈ యేడాది మే నుంచి అమల్లోరి రానున్నాయి. దీని ప్రకారం, విదేశాలకు వెళ్లి మెడిసిన్ సర్టిఫికేషన్ అర్హత పొందగోరే భారతీయ విద్యార్థులు నీట్ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. అయితే ఇప్పటికే విదేశాలనుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కళాశాలల్లో చేరే విద్యార్థులూ నీట్‌ను రాయాల్సిందే అని తెలిపింది.













