Zee Telugu: జయం, సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు.. మీ జీ తెలుగులో!

తెలుగురాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్ తో ఆకట్టుకుంటోన్న జీతెలుగు (Zee Telugu) సరికొత్త సీరియల్ ‘జయం’ (Jayam)తో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమసాగే సరికొత్త ప్రేమకథతో రూపొందుతున్న సీరియల్ జయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లనుఎదుర్కొంటూఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునేకథతోరానున్నజయం, జులై 14నప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8గంటలకు, మీ జీతెలుగులో!
జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్(శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.
ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.
ప్రముఖ నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, “జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్‌గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం,” అన్నారు.
జయం సీరియల్జులై 14 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభంతోఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి, చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి. దయచేసి జీ తెలుగు ప్రేక్షకులు గమనించగలరు.
భావోద్వేగాల సమాహారంగా సాగే సరికొత్త సీరియల్ జయం.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజురాత్రి 8 గం. మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!