అమరావతి శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ
అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో 9వ తేదీ ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి విచ్చేస్తారని తెలిపారు. ఈ ఆలయాన్ని రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.













