కంచి పీఠాధిపతి పర్యటన శుభదాయకం : వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంచి పీఠాధిపతి పర్యటన శుభదాయకమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శంకరమఠంలో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిని కలిసి అనంతరం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాతుర్మాస సందర్భంగా రాష్ట్రంలో విజయేంద్ర సరస్వతి చేస్తున్న పర్యటన ఆద్యాత్మిక చింతనను మరింత పెంచిందని తెలిపారు. సింహాచలం సందర్శన సందర్భంగా కంచి పీఠాధిపతికి ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 26న భీమిలిలో శంకర విజయేంద్ర సరస్వతి మహా కుభ యాగంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండేలా ఆశీర్వచనం చేయాలని విజేంద్ర సరస్వతిని కోరానన్నారు.













