జగదీప్ ధన్‌ఖడ్ తో వైసీపీ ఎంపీల భేటీ
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఆయనకు శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను ఇచ్చి సత్కరించారు. ధన్‌ఖడ్‌ను కలిసిన వారిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథన్ రెడ్డి, ఎంపీలు రెడ్డప్ప, ఆర్.కృష్ణయ్య, బి.వి.సత్యవతి, ఎం.వి.వి.సత్యనారాయణ, మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, బెల్లాన్ చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయులు, తలారి రంగయ్య, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎం.వి. రమణారావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు.













