ఉత్తరాంధ్ర అభివృద్దికి కృషి చేస్తా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి
వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్ర అభివృద్దికి కృషి చేస్తామని వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇవాళ విశాఖ అగనంపూడి ప్రాంతంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను సత్వరం అమలు చేసి ప్రజలకు దగ్గర అవుతామని అన్నారు. ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా అగనంపూడి నుంచి పాద యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవుతామని, వారి ఇబ్బందులను తెలుసుకుని ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.













