ఉత్తరాంధ్ర నుంచి సీఎం వైఎస్ జగన్ ..ఎన్నికల శంఖారావం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంద్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిద్ధం సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ గెలుపునకు అస్త్రాలని పేర్కొన్నారు. ఒకవైపు పాండవ సైన్యం, మరో వైపు కౌరవ సైన్యం. ఇక్కడి ఉన్నది అభిమాన్యుడు కాదు అర్జునుడు. ఈ అర్జునిడికి దేవుడి దయ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల అండ ఉంది. మీరందరి అండదండలు ఉన్నంతకాలం ఎవరికీ భయపడేది లేదు. ఈ యుద్ధంలో 175 సీట్లలోనూ మనమే గెలుస్తున్నాం. చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరో పాతికేళ్ల వైసీపీ జైత్రయాత్ర కొనసాగాలి. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. గతంలో అనేక పార్టీల అబద్ధాల మేనిఫెస్టోలు చూశారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. దత్తపుత్రుడు ఇతరులతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావని వారికి తెలుసు. అందుకే ఎత్తులు, జిత్తులు, పద్మవ్యూహాలు రచిస్తున్నారు అని విమర్శిలు చేశారు.













