పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విజయసాయి రెడ్డి
కేంద్ర రహాదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం ఆదేశాలు జారీ చేసింది. తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక, మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ఉపరాస్ట్ర పతి జగ్దీప్ దన్ ఖడ్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్కు రుణపడి ఉంటానన్నారు.













