ఏపీకి కేంద్రం మొండిచేయి…విజయసాయి
బడ్జెట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందని వైకాపా ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్ర ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై ఆయన స్పందించారు. కేంద్ర బడ్జెట్ తమను నిరాశపరిచిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. ఏపీకి ఎన్ని నిధులిస్తున్నారనే విషయంపైనా సృష్టత లేదని విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డులు ఇవ్వడం మంచిదేనని అన్నారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై సృష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.













