వైసీపీకి మరో షాక్.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుడిని కాదని తెలిపారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని తెలిపారు. నరసరావు పేట లోక్సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోందన్నారు.













