జగన్ తిరిగి సీఎం అయితే.. చంద్రబాబును
వచ్చే సాధారణ ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎం అయితే చంద్రబాబు చావడం ఖాయమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభతో సామాన్యుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రహదారిని మూసివేశారు. వాహనాలను మళ్లించినా, దారి తెలియక చోదకులు అవస్థలు పడ్డారు. రెండు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. అంబులెన్సులు ప్రజల మధ్యన చిక్కుకోగా పోలీసులు అతి కష్టమీద వాటిని ముందుకు పంపించారు.













