వైసీపీకి మరో షాక్.. ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా?

వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవుల నుంచి వైదొలగనున్నారని సమాచారం. దీంతో పాటు వైసీపీకి కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న విషయం తెలిసిందే.