ఏపీ ఉపసభాపతిగా కోన రఘుపతి ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు., ఆయన ఒక్కరే నామినేన్ దాఖలు చేసినందున ఎన్నిక ఏకగ్రీవమైందని సభాపతి తమ్మినేని సీతారం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఉపసభాపతి రఘుపతిని సభాస్థానం వరకూ తోడ్కొని వెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం అధికార, ప్రతిపక్షసభ్యులు ఉపసభాపతికి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోకవర్గం నుంచి కోన రఘుపతి గెలుపొందిన విషయం తెలిసిందే. సౌమ్ముడు, వివాద రహితుడు కావడంతో జగన్ ఆయనను డిప్యూటీ స్పీకర్గా ఎంచుకున్నారు.













