సీఎంగా జగన్ ఉన్నంత వరకు నన్నేం చేయలేరు : జయరాం
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆంధప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని జయరాం కలిశారు. అనంతరం జయరాం మీడియాతో మాట్లాడుతూ దందాగిరీ చేయడానికి నేనేమీ అంతరాష్ట్ర స్మగ్లర్ వీర్పన్ను కాదని వ్యాఖ్యానించారు. పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండి అని చెప్పిన మాట వాస్తవమే. నేను దౌర్జన్యంగా మాట్లాడలేదు. నాపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని అందరిని కోరుకుంటున్నాను. నా నియోజకవర్గ సమస్యలపై మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడాను. సీఎం సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదు. టీడీపీ నేత లోకేష్‌కు యోగ్యత లేదు. నా నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. మద్యం సేవించేవారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. మద్యం ఏరులై పారుతుంటే నేనుం చేయగలను అని తెలిపారు.













