టీడీపీలోకి గౌరు దంపతులు ?
కర్నూలు జిల్లాలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, ఆయన సతీమణి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేయిచ్చినట్లు తెలిసింది. ఈ దఫా పాణ్యం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి ఇస్తున్నట్లు ఆయన సృష్టం చేయడంతో గౌరు దంపతులు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. 2014లో పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు నెలల క్రితం బీజేపీ నుంచి వైసీపీలో చేరారు. జిల్లాలో గౌరు వెంకటరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. మార్చి 2న కర్నూలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఆ రోజు కోట్ల కుటుంబం టీడీపీలో చేరనుంది. వారు టీడీపీలోకి వస్తే నంద్యాల లోక్‌సభ సీటును మాండ్రకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది.













