తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే వైసీపీ నుండి పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆమెతో పాటు పలువురు సర్పంచ్లు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ఆత్మాభిమానం దెబ్బతీశారని అన్నారు. నేను చేసిన పనిని ప్రతిపక్షనేత గుర్తించకపోవడంతోనే పార్టీ మారుతున్నానని తెలిపారు. నేనెప్పుడు గిరిజన పక్షపాతినని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో గిరిజనుల బతుకులు బాగుపడతాయని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.













