అవసరమైతే నేనే ఆ సినిమాకు ప్రొడక్షన్ చేస్తా : మంత్రి అమర్ నాథ్
సినిమాలు వేరు, రాజకీయాలు వేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం పవన్ కల్యాణ్ అని సినిమా తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. అవసరమైతే నేనే ఆ సినిమాకు ప్రొడక్షన్ చేస్తానని తెలిపారు. ఆయన ఎలాగూ సీఎం కాలేరు. సినిమా తీస్తే అభిమానులైనా సంతోషిస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ కూడా పక్కవారి కోసమే తన పార్టీని ప్రయోగిస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పవన్ పోటీ చేయలేదు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం పోటీ చేసి ఓడిపోయారు. 2024లో అయినా 175 సీట్లలో పోటీ చేస్తానని పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. బాబు హయాంలో పెన్షన్ రావాలంటే మరొకరు చనిపోవాలి. ఇప్పుడు కొత్తవారికి కూడా పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియా చూడలేకపోతోంది అని మండిపడ్డారు.













