లోటస్ పాండ్ వద్ద వైకాపా విజయోత్సవాలు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లో సంబురాలు నిర్వహించారు. లోటస్‌పాండ్ పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవాలు జరుపుకొన్నారు. జంట నగరాల్లో ఉన్న వైకాపా నేతలు, అభిమానులు ఇక్కడికీ భారీగా తరలివచ్చారు. మిఠాయిలు పంచుతూ, నృత్యాలు చేస్తూ, బాణసంచా కాల్చుతూ సంబురాల్లో పాల్గొన్నారు. ఆంధ్రాలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ స్థానాలు రావడంతో పార్టీ కేడర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ముఖ్య నేతలు అందరూ అమరావతిలో ఉన్నా తెలంగాణ వైకాపా నేతలు లోటస్‌పాండ్‌కు తరలివచ్చి సంబరాల్లో పాల్గొనడం విశేషం.













