విదేశీ పర్యటనలో వైసీపీ నేతలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు విదేశీ పర్యటనలో ఉన్నారు. రష్యా, సమీప దేశాల్లో పర్యటిస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్నవారిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జమ్మలమడుగు, కమలాపురం, రైల్వే కొడూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్‌బాబు, వైసీనీ నేత మాసీమబాబు, మరికొంత మంది నేతలు ఉన్నారు. ఓ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు వీరు విదేశీ పర్యటనకు వెళ్లారు. వీరి విదేశీ పర్యటలో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.













