Ambati Rambabu: రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు వైసీపీ నేత అంబటి రాంబాబు తరలింపు
మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టై రాజమహేంద్రవరం (Rajahmundry) జైల్లో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)ను గుంటూరు (Guntur) తరలించారు. పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ ఆందోళన సందర్భంగా పోలీసులతో అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించారని గతంలో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 12న జరిగిన ఘటనపై పట్టాభిపురం (Pattabhipuram) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం అంబటిని రాజమహేంద్రవరం నుంచి గుంటూరు తరలించారు. సీఎంను దషించిన కేసులో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్‌పైనా కోర్టులో విచారణ జరనుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













