రాజీనామా చేసి తప్పు చేశాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ చర్చకు అనుమతించడం, పార్లమెంటులో టీడీపీ ఎంపీల హడావుడి వంటి పరిణామాలతో వైసీపీ శిబిరం డీలా పడింది. రాజీనామా చేసి తప్పు చేశామన్న అపరాధ భావన మాజీ ఎంపీల్లోనూ వ్యక్తమవుతోంది. అవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం గత సమావేశాల్లో చర్చకు రానివ్వకుండా అడ్డుకుని, ఇప్పుడూ అనూహ్యంగా అంగీకరించడంపై వారు అసహనంగా ఉన్నారు. తమను కలిసిన మీడియా సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అనవసరంగా రాజీనామా చేశామని అనిపిస్తోందని ఓ సీనియర్ మాజీ ఎంపీ వాపోయారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని ఒంటిరిగా ఓడించడం అంత సులభం కాదని వైసీపీ మాజీ ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు. పవన్‌తో చేతులు కలిపితేనే ఆ పార్టీని ఓడించడం సాధ్యమవుతుందని తెలిపారు.













