రాజ్యసభ సభ్యులుగా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందించారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అజెండా మేరకు పనిచేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.













