నిన్న అసెంబ్లీ.. నేడు శాసనసభ.. బాయ్ కాట్ మోడ్లో వైసీపీ.. అసలు కారణం ఏమిటో?
2024 ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో బయట నుంచి వచ్చే విమర్శల కంటే ఆ పార్టీ నేతల నిర్వాకాల వల్ల వస్తున్న విమర్శలు ఎక్కువ అనడంలో డౌట్ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా శాసనసభ సమావేశాలను జగన్ పార్టీ బాయికాట్ చేయడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సభలకు దూరమైన ఈ పార్టీ ఇప్పుడు శాసనసభ సమావేశాలకు కూడా దండం పెట్టింది. అసెంబ్లీలో తమకు మైకు ఇవ్వడం లేదని కుంటి సాకులు చెప్పి వెళ్లకుండా ఎగ్గొట్టిన వైసీపీ.. శాసనమండలికి మాత్రం వెళ్లడానికి సుముఖత చూపింది. అయితే ఇది ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోతుందని ఎవరూ భావించలేదు. కేవలం సంఖ్యాబలం గట్టిగా ఉంది కాబట్టే శాసనసభ సమావేశాలకు వెళ్లడానికి వైసీపీ ఎమ్మెల్సీలు మొగ్గు చూపారు అని అందరూ భావించారు. పోనీ అక్కడ అన్న ఏమన్నా చేస్తారా అని అనుకునే లోపే నేడు జరిగిన మండలి సమావేశాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
ఈరోజు జరిగిన మండలి సమావేశాలలో విశాఖపట్నం జిల్లాలో డయేరియా కారణంగా జరిగిన మరణాలపై చర్చ జరిగింది. అయితే అసలు ఆ ప్రాంతాలలో ఎటువంటి డయేరియా మరణాలు జరగలేదని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. మరోపక్క అక్కడ పదుల సంఖ్యలో ఈ మరణాలు సంభవించాయి అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు సభలో నినాదాలు చేశారు. అనంతరం సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేశారు.
గుర్ల గ్రామంలో డయేరియా పారిన పడి సుమారు 200 మంది వివిధ ఆసుపత్రిలో చికిత్సలు పొందారని.. అయితే వారిలో కొంతమంది చనిపోయారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదిమంది డయేరియా బారిన చనిపోయినట్లు చెప్పిన విషయాన్ని తిరిగి గుర్తు చేశారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు జగన్ రెండు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించగా.. ప్రభుత్వం నుంచి మాత్రం ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు అని నిలదీశారు.. అసలు విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం వైసీపీ నాయకులు వాకౌట్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారుతోంది.













