బద్వేలులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక నెల్లూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు వాహనాల్లో చేరుకుని అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయంలోని నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్గార్గ్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్మేలు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆమె వెంట ఉన్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం అభ్యర్థి డాక్టర్ సుధ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గల్లో ఒకటైన బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.













