ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ 18 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ పేర్లను ప్రకటించారు. శ్రీకాకుళం నర్తు రామరావు, తూర్పుగోదావరి కుడుపూడి సూర్యనారాయణ, పశ్చిమ గోదావరి కవురు శ్రీనివాస్, నెల్లూరు మేరుగ మురళీధర్, చిత్తూరు సిపాయి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎ.మధు సూదన్, అనంతపురం ఎస్ మంగమ్మ, ఎమ్మెల్యే కోటాలో … పెన్మెత్స వీవీ సూర్యానారాయణరాజు, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్, గవర్నర్ కోటాలో కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.













