ఏపీలో జిల్లా పరిషత్తు చైర్మన్ లు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలకు జిల్లా పరిషత్తు చైర్మన్ అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. శ్రీకాకుళం జిల్లాకు పిరియా విజయ, విజయనగరం జిల్లాకు మజ్జి శ్రీనివాస్, విశాఖపట్నానికి ఎ.సుభద్ర, తూర్పుగోదావరికి వి.వేణుగోపాల్, పశ్చిమగోదావరికి కె.శ్రీనివాస్, కృష్ణాకు ఉప్పాళ్ల హారిక, గుంటూరుకు క్రిస్టినా, ప్రకాశం కు బూచెపల్లి వెంకాయమ్య, నెల్లూరుకు ఆనం అరుణ, చిత్తూరుకు శ్రీనివాసులు, కడపకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కర్నూలుకు వెంకట సుబ్బారెడ్డి, అనంతపురం జిల్లాకు గిరిజను జిల్లా పరిషత్తు చైర్మన్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.













