వైసీసీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఎన్నికల సమయంలో పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కారణంగా పిన్నెల్లి ఇంతకాలం అరెస్టు కాలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు వెంటనే ఆయన్ను నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మే 13న పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రెచ్చిపోయారు. రెంటచింతల మండలం పాల్యాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. దీనిపై రెంట చింత పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.













