వైఎస్సార్ అచీవ్మెంట్-2022 పురస్కార గ్రహీతలు వీరే…
అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ మీడియాకు వెల్లడి
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, డాక్టర్ వైఎస్సార్ అచీవ్మెంట్`2022 పురస్కారాలకు ఎంపికైన దిగ్గజాల జాబితా విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన విశిష్ట వ్యక్తులు, సామాజిక సేవ రంగంలోని వివిధ సంస్థలకు కలిపి 30 అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్), అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడిరచారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ప్రతిబింబించేలా ప్రజా సేవకు కృషి చేస్తున్న వారిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అవార్డులకు ఎంపిక చేశామన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా అవార్డులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయానికి 5, సంస్కృతి`సంప్రదాయాలకు 5, మహిళా సాధికారత, రక్షణకు 3, సాహిత్య సేవ రంగానికి 3, విద్యా రంగానికి 4, పత్రికా రంగానికి 4, వైద్య రంగానికి 5, పరిశ్రమ రంగంలో ఒక అవార్డును ఇస్తున్నామన్నారు. 20 మందికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, 10 మందికి అచీవ్మెంట్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలను 20 మందికి, వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారాలను 10 మందికి ఇవ్వనున్నట్టు కృష్ణమోహన్ తెలిపారు.
లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక.. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపికలను అందజేస్తామన్నారు. దిశ పోలీసింగ్ విభాగంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితులను కాపాడిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను ఇస్తున్నామన్నారు. సమాచార శాఖ కమిషనర్ విజయ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామన్నారు.
1. వ్యవసాయం
1) ఆదివాసీ కేష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ – సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా.
2) కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ; బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా
4) అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ –కె.ఎల్.ఎన్. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా
5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా… కమిటీ సమాలోచనల తరవాత తుది జాబితాగా ప్రతిపాదించటం జరిగింది.
– వీరందరికీ వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డులు ప్రకటిస్తున్నాం.
2. కళలు–సంస్కృతి విభాగంలో…
1) కళాతపస్వి కె.విశ్వనాథ్ (వైఎస్సార్ లైఫ్‌టైమ్)
2) ఆర్.నారాయణమూర్తి (వైఎస్సార్ లైఫ్‌టైమ్)
3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (వైఎస్సార్ అచీవ్మెంట్)
4) పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్ (వైఎస్సార్ అచీవ్మెంట్)
5) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ షేక్ గౌసియా బేగం (వైఎస్సార్ అచీవ్మెంట్)
3. సాహిత్య సేవలో…
1) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్;
2) ఎమెస్కో ప్రచురణాలయానికి…
3) రచయిత డాక్టర్ శాంతి నారాయణ గారికి… వారి సేవలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలను ప్రకటిస్తున్నాం.
4. మహిళా సాధికారత–రక్షణ విభాగంలో…
1) ప్రజ్వలా ఫౌండేషన్– సునీతా కృష్ణన్గారికి…
2) ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్ వారికి… వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం.
3) ఇక మూడో అవార్డును దిశ–పోలీసింగ్‌కు ప్రకటిస్తున్నాం. నేరం జరగక ముందు, జరుగుతోందనే సమాచారం ఉన్నప్పుడు… ఒక బాలిక లేదా మహిళ ఆపదలో ఉన్నప్పుడు… వెంటనే వారిని ఆదుకునే వ్యవస్థగా… మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌గారి చొరవతో, ఆయన మానస పుత్రికగా దిశ యాప్ రూపొందింది.
– దిశ యాప్‌ద్వారా వచ్చిన ఎస్వోఎస్ను అందుకున్న వెంటనే నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరకుని కాపాడిన అయిదుగురు పోలీసులకు… ఈ ఏడాది వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డును ఉమ్మడిగా ప్రకటించటం జరుగుతోంది.
– రవాడ జయంతి; ఎస్వీవీ లక్ష్మీనారాయణ; రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య; పి.శ్రీనివాసులు… వీరికి సంయుక్తంగా వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేయటం జరుగుతోంది.
5. విద్యా రంగం నుంచి…
ఇంట్రొడక్షన్ అవసరం లేని విద్యా సంస్థలు రెండింటికి…
1) మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థకు
2) కావలి– జవహర్ భారతి విద్యా సంస్థకు
వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం.
3) వ్యక్తిత్వ వికాసం… ఆలోచన విధానం… మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు శ్రీ బి.వి.పట్టాభిరాం గారికి… లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం.
4) బ్యాంకింగ్ రంగంలో వేల మంది ప్రవేశానికి దారి చూపిన దార్శనికుడు, మంచి మాస్టారు… నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డిగారికి… వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం.
5. మీడియా అవార్డులు
సీనియర్ పాత్రికేయులు
1) భండారు శ్రీనివాసరావు
2) సతీశ్ చందర్
3) మంగు రాజగోపాల్
4) ఎంఈవీ ప్రసాదరెడ్డి
– ఈ నలుగురికీ వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులు ప్రకటిస్తున్నాం.
6. వైద్య రంగంలో విప్లవాలకు అంటుకట్టిన…
1) డాక్టర్ బి. నాగేశ్వరరెడ్డి, ఏఐజీకి… ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారికి;
2) డాక్టర్ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ వారికి… (హెపటైటిస్–బి వ్యాక్సిన్)
3) భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు… (కోవాక్సిన్)
4) అపోలో హాస్పటల్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శ్రీ ప్రతాప్ సి రెడ్డిగారికి…
5) ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తరఫున శ్రీ గుళ్ళపల్లి నాగేశ్వరరావుగారికి…
ఈ అయిదు సంస్థలు/వ్యక్తులకు వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులు ప్రకటిస్తున్నాం.
7. పారిశ్రామిక రంగంలో
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శ్రీ గ్రంధి మల్లికార్జునరావుగారికి… వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం.
ఇందులో రంగాల వారీగా చూస్తే… వ్యవసాయానికి 5; సంస్కృతి–సంప్రదాయాలకు 5; మహిళా సాధికారత, రక్షణకు 3; తెలుగు భాషకు 3; విద్యా రంగానికి 4; మీడియా నుంచి 4; వైద్య రంగానికి 5; పరిశ్రమకు 1 అవార్డుల్ని ఇవ్వటం జరిగింది.
ఈ మీడియా సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ శ్రీ టి. విజయకుమార్ రెడ్డి, అవార్డుల కమిటీ మెంబర్- కన్వీనర్ శ్రీ బాలసుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.













