కళ్యాణమస్తు, షాదీ తోఫా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాదు పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్ఆర్ కల్యాణమస్తూ వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానుండగా దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 30న లాంఛనంగా ప్రారంభించారు.
వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. చదువును ప్రోత్సహించేందుకు ఈ నిబంధనను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇక వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని ప్రభుత్వం తెలిపింది.













