BTech Ravi:ఇద్దరు సీఎంలుగా ఎన్నికైనా .. పులివెందులలో ఏం అభివృద్ధి జరిగింది? : బీటెక్ రవి

ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఎన్నికైనా పులివెందుల (Pulivendula) లో ఏం అభివృద్ధి జరిగింది అని పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి (BTech Ravi) అన్నారు. పులివెందులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరినీ నామినేషన్లు వేయనీయరంటూ వైసీపీ నేత సతీశ్‌రెడ్డి (Satish Reddy) అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన జడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికలో 11 మంది నామినేషన్లు వేశారని గుర్తు చేశారు. రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించినా వైసీపీకి డిపాజిట్ దక్కలేదన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామని తెలిసే నామినేషన్ వేయనీయరని ఇప్పటి నుంచే టీడీపీపై తప్పుడు ప్రచారానికి కుట్ర చేస్తున్నారన్నారు. ఎర్రబెల్లి చెరువుకు ఎన్నికల్లో చెప్పినట్లు నీళ్లు ఇచ్చాం. నల్లపురెడ్డిపల్లెలో రెండువేల బోర్లు ఛార్జ్ అయ్యాయి. కొండారెడ్డి చెరువు నిండితే పులివెందులకు నీళ్లిస్తాం. రియల్ ఎస్టేట్ కుదేలై ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా చెప్పినట్లే అభివృద్ధి చేస్తున్నాం. ఇకపైనా చేస్తాం అని అన్నారు.