ఆరోగ్యశ్రీ ప్రారంభించిన వైఎస్ జగన్
ఆరోగ్యశ్రీ పథకాన్ని పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మూడు రాష్ట్రాలకు వర్తింపజేసే పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో సుమారు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు వైద్యసేవలు నేటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోగులు ఎవరైనా ఆయా నగరాల్లో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం కలగనుంది. 130 ఆస్పత్రుల్లో గుర్తించి సూపర్ స్పెషాలిటీ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.













