ఘనంగా వైయస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, అంకంరెడ్డి మూర్తి పాల్గొన్నారు. అంతేకాకుండా పార్టీ నేతలు విజయచందర్, పుత్తా ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ప్రపుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













