Sunil Yadav : హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీకెందుకు అంత ఉలికిపాటు?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తనపై అనేక ఆరోపణలు చేశారని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ (Sunil Yadav) అన్నారు. ఈ మేరకు కడప (Kadapa) లో నిర్వహించిన మీడియా సమావేశం లో సునీల్ మాట్లాడుతూ తను కోట్ల రూపాయలు సంపాదించానని రాచమల్లు ఆరోపణలు చేశారని అన్నారు. తనవద్ద రూ.కోట్లు ఎక్కడున్నాయో రామచల్లు నిరూపించాలని సునీల్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో బీసీ నేతను ఎవరు చంపించారో అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చాక రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలి. హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీకెందుకు అంత ఉలికిపాటు? అవినాష్ రెడ్డి(Avinash Reddy), భాస్కర్‌రెడ్డి(Bhaskar Reddy), శివశంకర్ రెడ్డి (Sivashankar Reddy), ఉదయ్ పాత్రలు ఎందుకు చూపలేదు? వైసీపీ నాయకులే సినిమాను తీశారని అనుమానం కలుగుతోంది, వైసీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని అన్నారు.













