నాలో .. నాతో వైఎస్సార్ పుస్తకావిష్కరణ
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేజర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్సార్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుమందు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ రాజశేజర్రెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ, నాన్నను చూసిన విధంగా నాలో నాతో వైఎస్ఆర్ రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైఎస్సార్. ఆయనలో గొప్ప గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు. ఇది ఒక మంచి పుస్తకం అని పేర్కొన్నారు.













