ఆస్తి పంపకాలపై స్పందించిన వైఎస్ విజయమ్మ
వైసీపీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదు. ఈ ఘటనలు నా పిల్లలిద్దరికే కాదు, రాష్ట్రానికి మంచిది కాదు అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.













