కడప ప్రజల తీర్పు.. జూన్ 4న ప్రపంచానికి : సునీత
ఈ ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పులివెందుల, కడప ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం న్యాయాన్ని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ప్రజల కోసం 30, 40 సంవత్సరాలు పని చేశారని గుర్తు చేశారు. మాకు న్యాయం జరగాలని అందరి మనస్సుల్లో ఉంది. హస్తం గుర్తుకు ఓటు వేసి న్యాయాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యా. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా. ఇది న్యాయ పోరాటం, ప్రజలందరూ న్యా పోరాటం వైపే ఉన్నారు. వైఎస్ విజయమ్మ కూడా న్యాయం వైపే ఉన్నారు. పార్టీలకతీతంగా మాకు మద్దతివ్వాలి. కడప ప్రజల న్యాయం వైపు ఉంటారని జూన్ 4న ప్రపంచానికి తెలుస్తుందని నమ్ముతున్నా అని తెలిపారు.













