వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. అట్లూరి ప్రియాతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరినీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. జనవరి 2న మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తా. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం అని షర్మిల పేర్కొన్నారు.
వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరిది ప్రేమ వివహం. ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం రాజారెడ్డి అమెరికాకు వెళ్లగా, అక్కడ ప్రియా పరిచయం అయ్యారు. మొదట స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆపై ప్రేమికులుగా మరారు. రాజా, ప్రియా ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో త్వరలోనే ఒక్కటవ్వనున్నారు.













