వైఎస్ షర్మిల పోటీ ఎక్కడ..అసెంబ్లీ బరిలో లేక లోక్సభ?
సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. అసెంబ్లీ బరిలో ఉంటారా, లేక లోక్సభకు నిలబడతారా? కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం ఈ చర్చ నడుస్తోంది. ఆమె గడిచిన కొన్ని రోజులుగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల వడబోత చేపట్టారు. విజయవాడలో ఈ ప్రక్రియను కొనసాగించారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులతో మంగళగిరిలో షర్మిల ప్రతిజ్ఞ చేయిస్తారని పీసీసీ వెల్లడిరచింది. 2014, 2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో పోటీకి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు. కాగా, పీసీసీ చీఫ్గా ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే పులివెందుల నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారన్న చర్చ సాగింది.













