ఏపీలో పార్టీ ఏర్పాటు పై.. వైఎస్ షర్మిల క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టకూడదనే రూల్ ఏమీ లేదు కాదా? అని వ్యాఖ్యానించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పమంది. అంతేకాదు జగన్ ఏపీలో ఉండి ఇక్కడ తెలంగాణలో తనకు నష్టం కలిగిస్తున్నారని షర్మిల అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. వాటన్నింటికి తెరదించేలా ఏపీలో కూడా షర్మిల పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. తామొక మార్గాన్ని ఎంచుకున్నామని, ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.













