కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్ఠానం ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటికి దిగే అవకాశాలు ఉన్నాయి.













