సీఎం వైఎస్ జగన్ నివాసానికి షర్మిల.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్కు అందజేశారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయిందని కుటుంబ సమేతంగా హాజరుకావాలని జగన్ను ఆహ్వానించారు. అలాగే ఈ నెల 18న జరిగే ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల కోరారు.













