వైఎస్ షర్మిల వ్యాఖ్యల్లో ..వాస్తవం ఉంది : బీటెక్ రవి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు చెప్పారు. బాబాయ్ హత్య గురించి షర్మిల కుండబద్దలు కొట్టారు. తనను ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని ఆమె తెలిపారు. గతంలో కడప ఎంపీగా పోటీకి ఆమె ఒప్పుకొన్నట్లు జగన్కు వివేకా తెలిపారు. ఆ తర్వాత అంత:పుర రహస్యం ఏం జరిగిందో? పోటీకి షర్మిల అంగీకరించాక ఆయన హత్యకు కుట్ర జరిగింది. అవినాష్ రెడ్డికి సిగ్గు ఉంటే ఎంపీ బరి నుంచి తప్పుకోవాలి. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి నిలిపారు. రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ వైసీపీ. హంతకులు జగన్ చుట్టే తిరుగుతున్నారు అని అన్నారు.













