YS sharmila: వివేకా హత్యపై సాయి రెడ్డి ఇంకా బయటపెట్టాలి: షర్మిల
వైసీపీకి విజయసాయి రెడ్డి (Vijayasai reddy) రాజీనామా చేసిన అంశంపై వైఎస్ షర్మిల (Ys Sharmila) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో సాయి రెడ్డి నిజాలు చెప్పినందుకు సంతోషమని.. మరిన్ని విషయాలను ఆయన బయటపెట్టాలని షర్మిల కోరారు. ఈ కేసులో జగన్ ను, అవినాష్ రెడ్డిని కాపాడటానికి విజయసాయి రెడ్డి చాలా కష్టపడ్డారని షర్మిల వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి.. తన అన్న జగన్ కు అత్యంత సన్నిహితుడు అని.. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడం అంటే చిన్న విషయం కాదన్నారు షర్మిల.
జగన్ ఏ పని ఆదేశిస్తే…ఆ పని చేయడం.. ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని, రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా.. నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అని ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల.. ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడని ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలని కోరారు. జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు ? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు ? ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారన్నారు. నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడని మండిపడ్డారు. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడని తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీకి పంపాడని వ్యాఖ్యలు చేసారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికి అయినా విజయసాయి రెడ్డి నిజాలు చెప్పాలన్నారు.













