YS Sharmila: జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో.. అందరికి తెలుసు : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ (YS Jagan) హయాంలో మద్యం మాఫియాపై రోజూ థ్రిల్లర్ సిరీస్లో కథనాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎంగా చేసిన జగన్ పోలీసుల (Police) బట్టలూడదీస్తామనడం బాగోలేదు. జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను వాడుకున్నారు. రఘురామ (Raghurama) సహా పలువురు నేతలను ఎలా వేధించారో తెలిసిందే. జగన్ హయాంలో జత్వానీ (Jatwani) కేసులో పోలీసుల తీరు దారుణం. పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం తగదు. తన తప్పు ఉంటే విచారణ చేసుకోవాలని వైఎస్ఆర్ (YSR) చెప్పేవారు. విచారణ చేసుకోవాలని చెప్పట్లేదంటే జగన్ దోషి అని తెలుస్తోంది. తన తప్పులేదంటూ జగన్, విచారణ చేయాలని ఎందుకు చెప్పట్లేదు. వైఎస్ఆర్ మాదిరిగా తప్పుంటే ఉరి తీయాలని ఎందుకు చెప్పట్లేదు. తన వెనుక ఉన్నది మచ్చలేని వారని వెనకేసుకొస్తున్నారు. తమ హయాంలో మద్యం కొనుగోలుకు డిజిటల్ పేమెంట్లు లేవని జగన్ చెప్పారు. గతంలో నగదు చెల్లింపులతో భారీ అవినీతి జరిగిందని తెలుస్తోంది అని ఆరోపించారు.













