YS Sharmila: విశాఖ ఉక్కు సమావేశం లో ఓ ఆసక్తికర దృశ్యం

విశాఖ ఉక్కుపై విజయవాడ (Vijayawada) లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సమావేశంలో పాల్గొనడానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాగా, అప్పటికే వచ్చి కూర్చున్న వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఆమెను చూసి గౌరవ సూచకంగా లేచి నిలబడుతూ రా అమ్మా ఇక్కడ కూర్చో అంటూ తన పక్కనున్న కుర్చీని చూపించారు. అందులో కూర్చున్న షర్మిల, బొత్స, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) తో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. సమావేశం అనంతరం అన్నా వెళ్లొస్తా అంటూ బొత్సకు నమస్కరించారు.