హైదరాబాద్ నుంచి అమరావతికి జగన్ మకాం
హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మకాం మార్చేస్తున్నారు. ఇందుకు దసరాను ముహుర్తంగా ఎంచుకున్నారు. తాను శాశ్వతనివాసం ఏర్పరుచుకునే వరకూ అసెంబ్లీసమావేశాల సమయంలో తనకు కేటాయించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను తనకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా స్పందన రావాల్సి ఉందనివైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హైదరాబాద్ లో ఉండటంపై అధికార పార్టీ పలుమార్లు విమర్శలు గుప్పించింది. సొంత పార్టీ నేతలు కూడా ఇది రాజకీయం రాంగ్సిగ్నల్స్ పంపుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా హైదరాబాద్ లో కూర్చుని రాజకీయాలు చేస్తే ఇబ్బంది అని గ్రహించిన జగన్ మకాం మార్చటానికి నిర్ణయించుకున్నట్లు వైసీపీవర్గాలు తెలిపాయి.













