8న జగనన్న విద్యా కానుక
జగనన్న విద్యా కానుక ను ఈ నెల 8న ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం మొత్తం 42,34,322 మంది విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనుందని వెల్లడించారు. ప్రభుత్వ యాజమాన్యాంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లు అందజేస్తామని వివరించారు. ప్రతి కిట్లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెట్లు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు.













