కులాలు కాదు అనుభవం అంటున్న జగన్…?
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తి చూపిస్తున్న సరే కొన్ని పరిస్థితులు మాత్రం ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గంలో కొంతమంది సమర్థవంతంగా పని చేయకపోవడం అలాగే సచివాలయం వద్ద కు రాకపోవడం అధికారులకు సహకరించకపోవడం ఎమ్మెల్యేలు సమస్యల వినకపోవడం వంటివి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత మందికి ఎన్ని విధాలుగా చెప్పినా సరే కొంత మందిలో మార్పు రావడం లేదనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతున్నది. ఇప్పుడు జగన్ త్వరలోనే మంత్రివర్గ మార్పులు చేర్పులకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని స్వయంగా తానే పార్టీ నేతల వద్ద ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మంత్రివర్గంలోకి కొత్త మంత్రులను తీసుకోక పోయినా కొన్ని శాఖలను మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయం వచ్చే శాఖలలో సమర్థవంతమైన మంత్రులకు ఇప్పుడు ఆ శాఖలను అప్పగించే విధంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం.
ఒకవేళ క్యాబినెట్లోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే సమర్థవంతమైన ఎమ్మెల్యేలను క్యాబినెట్లోకి తీసుకోవాలని సీనియర్ ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తి చూపించాలి అని గతంలో ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఎమ్మెల్సీలను అలాగే ఎమ్మెల్యేలను ఒకసారి పరిశీలించి క్యాబినెట్లోకి తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలోకి చోటు కోసం సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కావాల్సింది సామాజిక వర్గ సమీకరణాలు కాదు అని రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని మెరుగు పరిచే విధంగా అనుభవం ఉన్న నేతలు కావాలి అని ముఖ్యమంత్రి జగన్ కొంత మంది అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆయన పార్టీ సీనియర్ నేతలు కూడా ఇప్పటికే కొన్ని పేర్లను సూచించారని పార్టీ సీనియర్లు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారని సమాచారం. అయితే పనిచేయని సీనియర్ మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి జగన్ పంపించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా సరే తిరుపతి ఉప ఎన్నికల తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.













